పోరాటమే ఆయన తంతు;-డా. పి.వి.ఎల్. సుబ్బారావు, 9441058797.
పంచపది
=========
1. ఉద్యమకారులందరూ,
    దిద్దాల్సిన పేరు "సుద్దాల!"

    నిజాం రావణ పాలిట,
     "హనుమంతుడు" అనాల!

    ఆవేశం అద్దిన పదశరాలు ,
                  ఆయనే వదలాల!

    పోరాటం జీవితం , 
     జీవితం పోరాటం,బతకాల!

   ఒకచేత్తో పెన్ను,
     మరోచేత్తో గన్ను ,
       విప్లవ సవ్యసాచి,పివిఎల్!

2. తెలంగాణ ఉద్యమ,
నిలయం ఆయనహృదయము!

పాటలతో సాయుధ పోరాటం,
           నిత్యం  తీవ్రతరము!

విద్య పెద్దగా లేకున్నా,
ఉర్దూ,తెలుగు సమన్వయము!

తెలంగాణ జాతి యావత్తు,
          ఆయన ప్రభంజనము!ప్రజాబాణీ, పాటలపోరాటం,
జీవితం, అంకితము,పివిఎల్!

3. ఆయన బుర్రకథవింటే ,
          గరిక సైతం ఓ చురికే!

   పల్లెటూరి పిలగాడా ,
            పాట జనానికి ఊపిరే!

   యక్షగానాలతో అందరిని,
            కదిపే గొప్ప కుదుపే!

  "గొల్లసుద్దులు" కళారూపాలు,
              పీడల ప్రతిబింబాలే!

భూమి,భుక్తి, బానిస విముక్తి,
కోసం బతికిన బతుకే,పివిఎల్!

_________


కామెంట్‌లు