బాల పంచపది
=============
1. సృష్టిలో మనిషి సంఘజీవి!
వ్యక్తులు కలిసి కుటుంబము!కుటుంబాలుకలిసి సమాజము!
జీవనము సామాజికజీవనము!
ఉమ్మడి కుటుంబం,
చిన్న సమాజం, రామా!
2. సామాజిక జీవనము!
మానవ జీవన ధర్మము! సమాజాన మెలిగే మర్మము! మనిషితెలియుటఅవసరము !
ఉమ్మడి కుటుంబం ,
చిన్న సమాజం, రామా!
3.ఉమ్మడి కుటుంబ సూత్రము!
కలిసి ఉంటే కలదు సుఖము!
నలుగురుతో కూడి జీవితము! బాధ్యత నిర్వహణ ముఖ్యము!
ఉమ్మడి కుటుంబం ,
చిన్న సమాజం ,రామా!
4. రక్తసంబంధం బలోపేతము!
ఉమ్మడి కుటుంబ రహస్యము!
ఏకాకి జీవితం వర్జితము!
ఉమ్మడిబతుకు సచ్ఛరిత్రము!
ఉమ్మడి కుటుంబం,
చిన్న సమాజం, రామా!
5. సామాజిక జీవన శిక్షణ!
వ్యక్తికి సహజరక్షణ !
చక్కగా సాగేపోషణ !
బాధ్యతల స్వీకరణ!
ఉమ్మడి కుటుంబం,
చిన్న సమాజం, రామా!
6. ఉమ్మడి కుటుంబాలు,
దూరము!
వ్యక్తి కుటుంబాల ,
కాలము!
పంచుకోవడం,
ఎరగము !
తాము బతకడమే,
గగనము!
ఉమ్మడి కుటుంబం,
చిన్న సమాజం, రామా!
7. వృద్ధులకి ఓల్డ్ ఏజ్ హోమ్స్!
శిశువులకి తెరిచిన క్రచెస్!
పిల్లలకి ఎన్నో కాన్వెంట్స్!
ఉమ్మడి కుటుంబం బ్రాంచెస్!
ఉమ్మడి కుటుంబం,
చిన్న సమాజం రామా!
________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి