బాల పంచపది
============
1. పిల్లల ఆటలలో గుర్రము!
రాజుల వేటలలో గుర్రము!
సైన్య పురోగమనం గుర్రము!
అదిలిస్తే మరి ఆగదు గుర్రము!
గుర్రం వేగ చిహ్నం ,
శౌర్యతేజం, రామా!
2. ఓనాడు ఒంటెద్దు బండి!
తోడుగా రెండెద్దుల బండి!
వచ్చింది మరి జట్కాబండి!
టకటక పరుగులు కదండి!
గుర్రం వేగ చిహ్నం,
శౌర్యతేజం, రామా!
3. యోగాశ్వం ,
లవకుశులు యుద్ధము !
రాముడినే,
ఎదిరించిన వైనము!
ఫలించని
మారుతి రాయబారము !
సీతమ్మ,
చేసిన పరిష్కారము!
గుర్రం వేగ చిహ్నం ,
శౌర్యతేజం ,రామా!
4. కురుక్షేత్రాన విజయసారథి!
నాలుగు గుర్రాల రథసారథి!
విజయుని విజయరథమది!
దిగ్విజయం అందించినది!
గుర్రం వేగ చిహ్నం,
శౌర్య తేజం, రామా!
5. "చేతక్ ",
రాణాప్రతాప్ గుర్రము!
బజాజ్ స్కూటర్,
సుందర నామము!
యువకుల ,
సుందర స్వప్నము!
రహదారుల,
నడిచే లోహాశ్వము!
గుర్రం వేగ చిహ్నం,
శౌర్యతేజం , రామా!
6. చదరంగం ఆటలో గుర్రము!
అడ్డంకుల్ని దాటే నైపుణ్యము!
ఆటలో ఉంటే చాలు గుర్రము!
మన గెలుపు మరి ఖాయము!
గుర్రం వేగ చిహ్నం,
శౌర్యతేజం, రామా!
7. సూర్యుడికి ,
ఏడు గుర్రాల రధము!
అశ్వదళం ,
రాజుకి బలము!
అశ్వదళం,
రాష్ట్రపతి గౌరవము!
,
మనసు గుర్రం,
నీతి సరి కళ్ళెము!
గుర్రం వేగ చిహ్నం,
శౌర్యతేజం ,రామా
_______
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి