బాల పంచపది
=============
1. జీవితం ,
ఓ దీర్ఘ పోరాటము!
మనిషి,
యోధుడి అవతారము!
అతడి ,
ధర్మము, పరాక్రమము!
ధైర్యంతో ,
సాగడం, ఉత్తమము!
ఆపదల కాచేది ,
మన ధైర్యమే, రామా!
2. పిరికివాళ్లు,
కొరగానివాళ్లు!
ధీరులే ,
అసలైన మొనగాళ్లు!
మొనగాళ్ళే ,
దాటుతారు మైలురాళ్లు!
వాళ్లే ,
సరి విజయాల గీటురాళ్లు!
ఆపదల కాచేది ,
మన ధైర్యమే ,రామా!
3. పిరికితనం ,
నిత్యం మరణం !
ధైర్యానికి,
మరణం శరణం !
దీరులే ,
గెలుస్తారు రణం!
మరణిస్తే,
చేరుతారు స్వర్గం!
ఆపదల కాచేది ,
మన ధైర్యమే, రామా!
4. బాలచంద్రులై,
ఉద్యమించాలి!
వీరాభిమన్యులై,
పోరాడాలి!
ఝాన్సీరాణులై ,
చరిత్ర వ్రాయాలి!
రుద్రమదేవిలై,
కత్తులు తిప్పాలి!
ఆపదల కాచేది,
మన ధైర్యమే , రామా!
5. సముద్రం ,
లోతున మంచి ముత్యాలు!
ఒడ్డున ,
కేవలం నత్త గుల్లలు!
ధైర్యంతోనే,
విజయాలు కొల్లలు!
విస్తరించాయి,
రాజ్యాల ఎల్లలు!
ఆపదల కాచేది,
మన ధైర్యమే, రామా!
6. ధైర్యంతో,
నడిస్తే జీవితము!
అధైర్యంతో,
ఆగితే మరణము !
ధైర్యం ,
మనిషికి అసలు అందము!
అధైర్యమే,
ఓ అవయవ లోపము!
ఆపదల కాచేది ,
మన ధైర్యమే, రామా !
_________
పదండి ముందుకు!;-డా. పి.వి.ఎల్ .సుబ్బారావు. 9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి