గృహమే దేహము;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మనం ఇంటిలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం ఆ ఇంటిని శుభ్రంగా తుడుస్తాము. ఎలాంటి అడ్డంకులు లేకుండా  వస్తువులన్నీటిని సక్రమంగా సద్దుకుంటాము.  వర్షానికి తడవకుండా ఎండకు ఎండకుండ భద్రతలు తీసుకుంటాము. అలాగే మీ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి అని నా అభిప్రాయం అంటూ ఈ పద్యాన్ని మనకందించారు వేమన. మనిషి మరణిస్తే బంధువులు స్నేహితులు అందరూ వచ్చి అయ్యో పాపం అని చాలా జాలి చూపించే వాళ్ళే. మమ్మల్ని అన్యాయం చేసి పోయావని ఏడ్చేవాళ్ళు, జీవించి ఉన్నప్పుడు అతను చేసిన పనులను ఏకరువు పెట్టి  ఉపన్యాసాలు చెప్పేవాడు కొందరు ఉంటారు. ఇంటిని అలికి శుభ్రం చేసి ఎన్ని  అలంకరణలు చేసినా దానిని విడిచి వెళ్ళ వలసి వచ్చినప్పుడు  వెళ్లక తప్పదు కదా అని మాత్రం ఎవరూ ఊహించరు. ధర్మరాజు  కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ  వింతల్లో వింత ఏది అన్న దానికి సమాధానంగా  మానవుడు తాను మరణిస్తాడని తెలిసి  మరణించిన భౌతికకాయం దగ్గరికి వెళ్లి సానుభూతి చూపడం  అని యక్షునికి చెబుతాడు  అది జీవిత సత్యం. వ్యాస మహర్షి రాసిన ప్రతి అక్షరం శిరోధార్యం  ఆ భౌతికకాయాన్ని చూసినవారు  ఇది పంచభూతములతో ఏర్పడినది కదా  ఆ శరీరము లో ఉన్న పంచ భూతములు తిరిగి పంచ భూతములలో కలిసేటప్పుడు  ఎందుకు బాధ పడతారు అని ఆలోచించే వాళ్లు ఎంతమంది ఉంటారు.    దీనిని లోకరీతిగా ఎంతమంది గ్రహిస్తారు వేమన లాంటి వారు తప్ప అందుకే అనుభవంతో రాసిన పద్యాన్ని మీరు కూడా ఒకసారి చదవండి.

దేహమనెడి యిల్లు దినదినంబునూడ్చి
యలికి పూసి మెత్తి యనువుజేసి కడకు వీడిపోవు
కపటిరా జీవుడు...



కామెంట్‌లు