అత్యాశ వ్యాపారుడు;-దూది అభిషేక్ రెడ్డి ఎనిమిదో తరగతి ఏ సెక్షన్, జెడ్పిహెచ్ఎస్ సిద్దిపేట. సెల్ నెం. 9704105200
ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామంలో ఒక వ్యాపారుడు ఉండేవాడు. అక్కడ ఆ గ్రామంలో వ్యాపారుడి కిరాణం కొట్టు  ఉండేది. అక్కడి ప్రజలు ఆ కొట్టులోనే కిరాణ సామాగ్రి తీసుకునేవారు. ఆ వ్యాపారుడు తక్కెడకు అయస్కాంతాలు ఎక్కించేవాడు. అట్లా కొద్ది సంవత్సరాలు గ్రామంలోని ప్రజలను మోసం చేస్తున్నాడు. ఒకరోజు ఆ గ్రామంలోని ఒక వ్యక్తి వ్యాపారుడి అయస్కాంతాలని అతికిస్తున్నప్పుడు చూసి గ్రామంలోని ప్రజలకు తెలియజేస్తాడు. ఆ గ్రామంలోని ప్రజలు వ్యాపారుడిని. ఒకరోజు కొట్టు తీస్తున్నప్పుడు వీళ్ళు కొట్టుముందుతున్న ఒక ఇంట్లో ఉండి వ్యాపారుడిని గమనిస్తారు. ఆ వ్యాపారుడు అయస్కాంతాలని అతికిస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి సరుకులు తీసుకోవడానికి కొట్టుకు వెళ్తాడు. ఆ సరుకులు అన్ని తక్కువ రావడంతో వేరే కొట్టుకు వెళ్లి జోకిస్తాడు. తక్కువ రావడంతో మళ్లీ కొట్టుకు వెళ్లి  వ్యాపారుడిని ఏకి పారేస్తారు. అప్పుడు ఆ వ్యాపారుడు నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుతాడు. ఆ గ్రామంలోని ప్రజలు ఆ వ్యాపారుడిని వదిలేస్తారు. అత్యాశ వల్ల అనర్ధమే ఉంటుందని తెలుసుకున్నాడు. మోసం వల్ల పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని అనుభవ తెలుసుకున్నాడు. భయం కలిగిన ఆ వ్యాపారుడు ఎవరిని మోసం చేయలేదు.  తన వ్యాపారాన్ని న్యాయంగా ధర్మంగా చేస్తున్నాడు. నాణ్యమైన సరుకులకు సరిపోయే ధర నిర్ణయించి వాస్తవం చెప్పాడు. ప్రజలందరూ ఆయన మాటలను నమ్మారు మంచి పేరు వచ్చింది. మంచి పేరుతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసాడు.

నీతి: మోసం చేస్తే మోసమే కలుగుతుంది న్యాయం చేస్తే న్యాయమే నిలుస్తుంది.


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very good beta. Good story