భవిత మేమే;--పి.విశాలాక్షి9908435805
 బాలలం మేము బా
చదువులు బాగా చదువుతాం
ఆటలు ఎన్నో ఆడేస్తాం
తెలివిగ మేము మసలుకుంటాం
చెట్లను మేము ప్రేమిస్తాం
మేమే స్నేహానికి ప్రతిరూపం అని నిరూపిస్తాం
లేలేత కిరణాలతో పోటీపడతాం
ప్రకృతిలో మమేకం అవుతాం
ఆచరించటం మా లక్ష్యం
సత్యమే పలుకుతాం
ఆవిష్కరణలెన్నో చేసేస్తాం
ప్రపంచానికి మేమేంటో చూపిస్తాం
పెద్దల బాటలో నడుస్తాం
అందరికి ఆదర్శంగ నిలుస్తాం
భావితరానికి 
బాటలు వేసేస్తాం...
బాలలం మేము బాలలం!


కామెంట్‌లు