అతడు మహిషాసురుడు⚜️---శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
👌మహిషుడొక జగమొండి!
     మెడవంగని శిఖండి!
     అతడొక దుండగీడు!
            ఓ తెలుగు బాల!

👌దానవ చక్రవర్తి!
     దుర్మదాంథుడు అతడు!
     అతడు మహిషాసురుడు!
         ఓ తెలుగు బాల!

           ( తెలుగు బాల పదాలు., శంకరప్రియ.,)

  👌"మహిష" మనగా దున్నపోతు! అది.. బలము కలదవుట వలన; ఆదరింప బడునది! అని, అమరకోశం "మహిష" శబ్దమును నిర్వచించింది! మహా బలవంతుడు..మహిషాసురుడు!

👌దుర్మార్గుడైన అతనికి.. లోకంలో ఆడినదెల్ల ఆటగా; పాడినదెల్ల పాటగా; సాగుచున్నది! అట్లే, సాధు పుంగవులను మునీశ్వరులను.. హింసించ సాగాడు!

👌అతని పేరు.. మహిషాసురుడు! యుక్తాయుక్త వివేక జ్ఞానమును కోల్పోయాడు! నయవంచకుడు! పరమ మూర్ఖాగ్రేసరుడు!

🚩 ఉత్పల మాల🚩
 ⚜️వాఁడొక రాక్షసుండు, నయవంచనలో మొనగాండు, సుంత మో 
     మోడఁడు లోకనిందకు, మరోద్ధతుఁ "డాడిన దెల్ల యాటగా"
      "పాడిన దెల్ల పాటగొ" ప్రపంచము సర్వము చాప చుట్టుచు 
     న్నాఁడటే నమ్మకమ్ము పయి నమ్మక మున్నది లేదు వానికిన్.

 ⚜️వాఁడొక తుమ్ము తుమ్మిన, నవ గ్రహముల్ భయ కంపితమ్ములై
      యూడిపడున్, ధరిత్రి పయి నొక్కవడిన వడగండ్ల కైవడిన్;
     వాఁడి విషాణముల్ దురదవాయఁగ వాఁడొక క్రుమ్ము క్రుమ్మినన్ 
       పోడిమి దక్కి బ్రద్దలయి పోవును నాకపురీ కవాటముల్!

⚜️పేరు మహిషాసురుఁడు! దగాకోరు! మ్రుచ్చు!  
       ధనమునకు మూర్ఖతకును "బెట్టినది పేరు"!!
       వాఁడు బాధింపనట్టి దేవతలు లేరు; 
        వాఁడు పరిభవింపని మునీశ్వరులు లేరు.

        ( మధురకవి, డాక్టర్ కరుణశ్రీ., "ఉదయశ్రీ" సంపుటము నుండి.,)

కామెంట్‌లు