👌జగతికి వినాశనము
కలిగించు దురాత్ములు!
వారె మహిషాసురులు!
ఓ తెలుగు బాల!
👌అహంకారము తోను
విర్రవీగు ప్రబుద్ధులు!
వారె మహిషాసురులు!
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., శంకరప్రియ.,)
👌"విశ్వ విజేతలు"గా విరాజిల్లవలెనని; అక్రమముగా, అన్యాయముగా వ్యవహరించు వారే.. "లోక కంటకులు"! వారు.. అధికార దాహంతో, అహంకారంతో, కన్నుమిన్ను కానకుండా విర్రవీగు చున్నారు! వారు.. అత్యాశతో, అత్యాచారములు కొనసాగించు చున్నారు! అటువంటి వారే.. "మహిషాసురుని ప్రతిరూపాలు!"
👌అపరాజితాదేవి.. దివ్య మహాశక్తిగా అవతరించి; మహిషాసురుని ప్రతినిధులైన, దుర్మార్గుల మదగర్వమును అణచివేస్తున్నది! ఈ విశ్వంలోని సకలప్రాణికోటిని కాపాడుచున్నది! ఆ విధముగా అందరికీ అభయప్రదానం కల్గించుచున్నది, జగదాంబ!
శివమస్తు! శ్రీరస్తు!
🚩ఉత్పల మాల 🚩
ఇమ్మహిషాసుర ప్రతిము లెందఱో ముందుయుగాలఁ బుట్టి వి
శ్వమ్మున కెగ్గొనర్ప "ననివార్య మహాజనశక్తిగా” సమై
క్యమ్మయి దుష్ట రాక్షసుల గర్వమడంచి జగమ్ము గాతు నం
చమ్మ భవాని కూర్మి నభయ మ్మిడియెన్ సకల ప్రజాళికిన్.
🚩తేటగీతి🚩
ఇది మహాశక్తి విజయము! ఇది దురంత
దుర్మద దురాక్రమణ దురుద్యోగములకు
దుర్భర పరాజయమ్ము! ఘాతుక కిరాత
జాతి పెనుభూతములకు శాశ్వత సమాధి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి