శ్రీరామలింగేశ్వర స్వామి;-- శంకరప్రియ., సంచారవాణి: 99127 67098
 🙏పార్వతీపతి  వీవె!
రామేశ్వరుడ వీవె!
    జగత్త్రాతవు నీవె!
శ్రీసాంబ! సదాశివ!
        ( సాంబశివ పదాలు , శంకర ప్రియ.,)
👌శ్రీపార్వతీ శ్రీరామలింగేశ్వర స్వామివారు.. కాకినాడజిల్లా, కాజులూరు మండలం, "శీల" గ్రామములో కొలువైయున్నారు! శ్రీ స్వామివారికి, కార్తిక మాసం సందర్భముగా, తొలిరోజున దేవస్థానం, మరియు, భక్తులసహాయ సహకారములతో.. "లక్ష బిల్వార్చన, కుంకుమార్చన, మృత్యుంజ హోమము, శాంతికర కళ్యాణం.." ది.26- 10-  22వ.తేదీని వైభవంగా జరిగింది! ఈ కార్యక్రమము.. సహస్రాధిక ప్రతిష్ఠాచార్యులైన.. బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, శివాచార్యులు గారి సారధ్యములో జరిగింది! ఇందులో.. ఉపన్యాసకోకిల, సూర్యశ్రీ; ప్రముఖ రచయిత, కె. కె. మంగపతి.. మున్నగు, ప్రముఖులు, భక్త మహాశయులు, గ్రామస్థులందరు.. భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు!
 🙏భీమసభ.. శైవక్షేత్ర నక్షత్ర దర్శిని! ఆ విధముగా భీమమండల మoదు "రోహిణీ" నక్షత్ర శైవ క్షేత్రములో ఒకటి  "శీల" మహా గ్రామము! ఈ గ్రామ మందు  వేంచేసి యున్న శ్రీస్వామి వారిని, "సీతాపతి యైన రామచంద్రుడు ప్రతిష్ఠాచేశారు!" అని పురాణగాథ! శివమస్తు!
 🚩తేటగీతి పద్యము:  
     "భీమ మండల" "శీలా"ఖ్య గ్రామ మందు
      అలరు, "శ్రీరామ లింగేశ్వరా"ఖ్య శివుడు 
       పార్వతీ సమేతుండు! శుభ ప్రదుండు! 
       తాత తాతల "తాతల  త్రాత" యగుచు!
   (రచన: శ్రీ గుండవరపు లక్ష్మీనారాయణ)

కామెంట్‌లు