మహిషాసుర మర్ధిని; శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 🙏సింహ వాహిని వీవె!
భువనేశ్వరివి నీవె!
     మహిషాసుర మర్ధిని!
శ్రీమాతా! శివాని!
      (శ్రీమాతా శివాని నామాలు., శంకర ప్రియ.,)
 
👌ఆదిపరాశక్తి.. ఈ స్థావర జంగమాత్మక మైన జగతికి తల్లి. కనుక, "జగజ్జనని"! చతుర్దశ భువనము లను శాసించునది! కనుక, "భువనేశ్వరి"! మృగరాజైన సింహమును వాహనముగా కలది. కనుక, "సింహేంద్ర వాహిని"!
👌శ్రీమాతా శివాని.. 
 దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన కొరకు.. పలు రూపములుగా అవతరించు చున్నది! ఆ విధముగా దుర్గా భవాని.. లోకములను పీడించుచున్న, మహిషాసురుని మట్టి కరిపించినది. కనుక, "మహిషాసుర మర్ధిని"గా; మనమంతా.. శ్రీమాతకు జయజయ ధ్వానములు పలుకు చున్నాము!
 🙏జయజయ మహిషాసుర మర్ధిని!
       జయ జయ దుర్గా భవాని!
        🚩తేటగీతి పద్యము🚩
🙏జయ మహాకాళి! జయ జగజ్జనని! జయిని! 
     రాజరాజేశ్వరీ! భవానీ! జయమ్ము! 
      త్రిపురసుందరీ! భువనేశ్వరీ! జయమ్ము!!
       జయము! సింహేంద్ర వాహినీ!  జనని! జయము!!
( మధుర కవి, డాక్టర్ కరుణశ్రీ.,)

కామెంట్‌లు