నానీలు;--- కయ్యూరు బాలసుబ్రమణ్యం శ్రీకాళహస్తి
చెట్లు
నిలబడే ఉంటాయి
నిన్ను
సగర్వంగా నిలబెట్టడానికి

చెట్లు జతలుగా
సేద తీరుతున్నాయి
బహుశా
సూర్యాస్తమయం కాబోలు

చెట్లకు 
వ్యధలుంటాయి
ఇవ్వడమే కాని
తీసుకోవడం చేతకాదు

ధరణి
ఎప్పుడూ సహన శీలే
అన్నిటిని
తనలో దాచుకుంటుంది

ఎక్కడ ఆపావో
అక్కడే మొదలు పెట్టు
ఇక ఆపడం
ఎవరి తరం కాదు


కామెంట్‌లు