సాటిలేని మేటి "పోస్ట్ బాక్స్'';- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు
ఎర్ర ఎర్రని డబ్బా
ముద్దులొలుకే డబ్బా
ఉత్తరాలను తనలో
దాచుకొనే డబ్బా

వీధుల్లో అక్కడక్కడ
దర్శనమిచ్చే డబ్బా
ప్రస్తుత కాలంలో
తగ్గిపోతున్న డబ్బా

"పోస్ట్ మ్యాన్"తో బంధం
దాని సేవలు అమోఘం
గడిచిన కాలంలో
ముమ్మరం వినియోగం

రాసిన ఉత్తరాలకు
రక్షణ "పోస్ట్ బాక్స్''
తపాలా సేవల్లో
ముందుండును "పోస్ట్ బాక్స్''   


కామెంట్‌లు