ఆఫర్లగోల్ మాల్-- నేటి మార్కెట్ లొల్లి --ఎం. వి. ఉమాదేవి.


 కొత్తవస్తువులమ్మేదానికి  
తమవ్యాపారానికి తళుకులద్ది 
లేనిపోని అబద్ధాలు ప్రకటనలు !
ఒకటికి రెండు ఉచితంగా అన్నా రెండూ కూడా పాతసరుకు అంటగట్టేదే !
అందులో మోసం బోలెడు !
 ఆఫర్లు తో ఆఫ్టర్ తలనొప్పి !
ఫ్లాష్ లైట్లవెలుగులో 
భ్రమపడి భలే ఉందని కొనేసి 
ఇంటికొచ్చి బాధపడేవాళ్లే అంతా!
క్లియరెన్స్ సేల్ అంటూ 
కిరికిరి.. 
ఇక వస్త్ర దానం చేసిన 
కృష్ణ మహిమలా 
ఫలానా బ్రదర్స్ హోల్ సేల్తో 
మన పర్సు మటాషే !!
తస్మాత్ జాగ్రత్త !!

కామెంట్‌లు