లలితగీతం :- " కరుణ లేదా.... వరుణ దేవా.... ! "--కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
          కరుణ లేదా..... 
  వరుణ దేవా.... !
  ఇక నైనా.... కనిక రించవా !!
  అతివృష్టి  -  అనావృష్టి తొ... 
    ఏడిపించెదవ !?
.. మమ్ములనేడిపించెదవా... !!
      " కరుణ లేదా....... "
చరణం :-
      నీకై ఎదురు చూసి.... 
  కళ్లు కాయ లే  కాసి... 2 
 మా కన్నీరు ధారలై కారినా... 
  నీ కారు గుండె కరుగదు..., 
  నాలుగు జల్లులైనారాల్చదు!2
          " కరుణ  లేదా...... " 
చరణం :-
      నువ్  కనికరించి వస్తి వని 
  మా కానందం తెస్తి వని....2
 మేముబ్బి - తబ్బిబ్బైనవేళ 
 ఉగ్రరూపం దాల్చినీవు... 2
మా నిండు బ్రతుకులు... 
        ముంచుతావా ... 2
 నీకిదిన్యాయమా వరుణదేవా 
 మమ్ము ప్రేమతో సాక రావా !!
 వాత్సల్యమునుచూపించలేవా 
నీ వాత్సల్యమును చూపించవ
       ******

కామెంట్‌లు