ఏడవకు ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఏడవకు ఏడవకు 
ఓ బుజ్జి బాబు 
ఏడుస్తె నిన్నెవరు
ఎత్తుకుంటారు 
అమ్మనాన్నలతో 
నువ్వు ఆడుకోవచ్చు
అక్కఅన్నలతో 
నువ్వు పాడుకోవచ్చు 
ఆడితే పాడితే 
మెచ్చుకుంటారు 
నవ్వితే నిన్నెంతొ 
ఇష్టపడతారు !!

కామెంట్‌లు