చిత్రపద్యాలు ;-ఎం. వి. ఉమాదేవి బాసర
ఆట వెలదులు 

ఆటపాటలకును ఆనందమెంతయో 
బాలబాలికలకు బాల్యమిదియె 
కల్లకపటమేమి కానరాదు మహిత
జ్ఞాపకాలు మదికి జ్ఞానమిచ్చు !!

ఎన్నిమాటలుండె చిన్ని మనసులోన
హాయిగాను పలుకు హరితసీమ 
తాయిలాలు దినుచు తగినశక్తిని బొందు 
నాటి కాలమెంత నాణ్యతుండె !!


కామెంట్‌లు