చెల్లీ! ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చిలకమ్మకూ పెళ్ళి
జరిగిందె చెల్లీ
చిందులెయ్యాకూ
నీవు మళ్ళీ మళ్ళీ
పూలతోటకు
వెళ్ళి రావే తల్లీ
మల్లె పూవులన్నీ
గిల్లి తేవే లిల్లీ 
దారంతో అల్లీ
దండలను చెయ్యీ
చిలకమ్మ చిలకయ్య
మెడలోన వెయ్యి 
దంపతులకూ విందు 
నీవు వడ్డించు చెల్లీ !!

కామెంట్‌లు