వంగ కళింగ రాజులు మొదట్లో చాలా సఖ్యంగా ఉండేవారు. వంగరాజు అనంగుడు ధైర్యం బుద్ధి మంచితనం మూర్తీభవించిన వాడు.శాంతి కాముకుడు.కళింగ రాజు దత్తుడు మొదట్లో బానే ఉన్నా అనుంగుడిపై చిర్రు బుర్రులాడేవాడు.లంచాలతో వంగదేశ మంత్రి సేనానులను లొంగదీయటం అసాధ్యం అని తెలుసుకున్నా డు.కానీ ఒక సేనాని దుర్ముఖుడు ఇతని బుట్టలో పడ్డాడు."నాసైన్యం లో చేరు.నీపై ఇంక ఎవరి పెత్తనం ఉండదు."అని ప్రలోభ పెట్టాడు. దుర్ముఖుడి తాత తండ్రి వంగ సైన్యంలో చిన్న పదవిలోనే ఉండి దేశం కోసం తమ ప్రాణాలు అర్పించారు. దుర్ముఖుడు మాత్రం తనకు ఉన్నత పదవి కావాలని డబ్బు కి దాసోహం అనేరకం! తల్లి శంకరి ఎన్నో విధాల నచ్చజెప్పేది"నాయనా! తల్లి తండ్రులు బంధువులు ఎప్పుడో ఒకప్పుడు రాలిపోటం ఖాయం. కానీ మాతృభూమి నేలతల్లి ఉన్న చోటునించి కదలదు.జాతి చరిత్ర సంస్కృతి నిలబడాలంటే దేశం పై ప్రేమ అభిమానం ఉండాలి. జన్మ భూమి స్వర్గం కన్నా మిన్న! "అని నచ్చ జెప్పినా మొండివాడు రాజుకన్నా బలవంతుడు అనిపించాడు."చూడమ్మా!తరతరాలుగా మనం వంగరాజు కొలువులో ఉండి ఏమి బావుకున్నాం? తాత నాన్న ప్రాణాలు అర్పించారు.మనకి తరగని సిరిసంపదలు లేవు.నాకూ పెద్ద హోదా పదవి లేవు.రేపు నాపిల్లలగతి ఏంటి? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది. "కీర్తి డబ్బు కండూతి పెరిగిన దుర్ముఖుడు కళింగ రాజ్యంలోకి వెళ్లి పోయాడు.తల్లి కి ఈవిషయం తమ ఇంట్లో పెరిగిన అనాధ గణపతి వల్ల తెల్సింది. "అమ్మా! అన్న చూడు ఎంత పనిచేశాడో? కళింగ సేనాపతిగా చేరాడని గూఢచారుల వల్ల తెల్సింది. "అంతే ఆతల్లి శోకం ఆవేశంతో ఊగిపోతూ అంది"దేశద్రోహం రాజద్రోహం చేసిన వాడు నాకడుపున చెడ బుట్టాడు."ఆరాత్రి ఆమె ఓమహిళ ఏడవటాన్ని గమనించి అడిగింది శంకరి"ఏమైంది అమ్మా!ఎందుకు ఏడుస్తున్నావు?" "నాకొడుకు వంగరాజ్యం తరుఫున పోరాడుతూ కళింగ కొత్త సేనాపతి చేతిలో హతుడైనాడు.ఇంకో కొడుకు ఉంటే ఎంత బాగుండేది?వంగదేశ రక్షణ కై పోరాడేవాడుకదా?దుర్ముఖుడి లాగా వాడు శత్రువుతో చేతులు కలపలేదని ఆనందంగా కూడా ఉంది. "ఆమాటలు శంకరి గుండెను చీల్చినాయి.సరిహద్దుల్లో డేరాలో ఉన్న దుర్ముఖుని కలవాలని బైలు దేరింది.ఆమెకు అనుమతి లభించటంతో కొడుకు ని చూస్తూనే బావురుమంది."అమ్మా!చూశావా నావైభోగం!" అంటున్న కొడుకుని ఆప్యాయంగా తడిమి తన చీరెకొంగుచాటున దాచిన బాకుతో కొడుకు ఛాతీలోకి బలంగా దింపింది. అలా తుఫాను ధాటికి నేలవాలిన అరటిచెట్టులా కింద పడిన కొడుకు ని చూస్తూ ఇంకో కత్తితో సర్ర్ న తన మెడను కోసుకుని "నీలాంటి దేశద్రోహిని కన్నందుకు సిగ్గు పడుతున్నాను"అంటూ ప్రాణం వదిలింది.గిలగిల కొట్టుకుంటూ
కొన ఊపిరి తో ఉన్న దుర్ముఖుని చూస్తూ లోపలకి వచ్చిన భటులు నిశ్చేష్టులైనారు.స్వలాభం కన్నా దేశం మిన్న అని భావించారు ఆనాటి వీరులు వీరమాతలు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి