ప్రియదైవము ;-డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 బాలలకు ప్రియమైన పార్వతీ తనయా 
పూజ సరిపోలేదని అలుగబోకయ్యా 
సకల దైవములలో తొలి నీవేనయ్యా 
సర్వభక్త జనావళికి ప్రియదైవమునీవయ్యా   
విఘ్నతతిని బాపె విఘ్న పతివి నీవు 
సతతము నిను మేము పూజింతుమయ్యా
ఎలుక వాహనమెక్కి ఏతెంచె స్వామీ 
ఏకవింశతి పత్రితో నిను అర్చింతుమయ్యా
బుజ్జాయి చదువుల ఒజ్జవూ నీవూ 
పూలతో నిను మేము అర్చింతుమయ్యా 
కుడుములన్నీ నీకు నైవేద్యమిడెదమూ 
ఇడుములన్నీ మాకు బాపుమోదేవా 
వేయి ఉండ్రాళ్ళతో విందు జేతుము నీకు 
విజ్ఞతగల చదువులు మాకు ఇవ్వుమోదేవా 
కోటి రూపాలతో కొలువైన వయ్యా 
పిన్పలను పెద్దలను కావుమో దేవా 
గణపతీ నవరాత్రి ఘనముగా జరిపేము 
ఘనమైన పూజలూ చేతుమో దేవా 
భక్తితో నిను కొలిచి మొక్కెదమయ్యా 
భరతజాతికి బంగారు భవితనివ్వయ్యా !! 


కామెంట్‌లు