బంగారు పాపలు(బాల గేయం)-ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
బాలలం బాలలం
బంగారుపాపలం
పాపలం పాపలం
కన్నతల్లి కనుపాపలం !!

పిల్లలం పిల్లలం
విరబూసిన మల్లెలం
ఘన ఘన మ్రోగేటి
నాన్న చేతి గంటలం !!

ఆడపిల్లలం మేము
అందాల ప్రతిమలం
ఆట పాటల్లో మేము
దీటుగా ఉంటాము !!

ఇంటింటా దీపాలం
వెలిగేటి జ్యోతులం
నట్టింట తిరిగాడే
నవ్వుల పువ్వులం
మేమే మా ఇంటి ఆడ బిడ్డలం !!


కామెంట్‌లు