సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నెనరు... నెమరు 
  ******
నెనరు అనేది వ్యక్తిలోని సహృదయతకు సూచిక. మంచితనానికి ప్రతీక.మానవీయ దీపిక.
నెనరుకు  ప్రేమ,దయ కరుణ, జాలి, సౌభాగ్యం,సౌహార్ధం, సౌజన్యం లాంటి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి.
సాటి వారిని అంతస్తుల వారీగానో, ఆస్తుల వారీగా నో ఎక్కువ తక్కువ భావనతో చూడకుండా అందరిపట్ల  నెనరు కలిగివుండాలి.వారిని మాటలు,చేతల ద్వారా బాధించకుండా సౌహార్దభావనతో,స్నేహ పూర్వకంగా కలుపుగోలుతనంతో మెలగాలి.
నెమరు అనే పదానికి స్మృతి,జ్ఞప్తి, తలపు,సంస్మృతి,స్మరము,అనుస్మరణము లాంటి  అర్థాలు ఉన్నాయి.
ఆహారాన్ని నెమరేసుకోవడం కొన్ని జంతువుల ప్రత్యేక లక్షణం.
మరి మానవులుగా మనం నెమరేసుకోవాల్సినవి ఏమిటో చూద్దాం.
మానవత్వం కలిగిన మానవులుగా మనం  మానవీయ విలువలైన నెనరులోని పదాలను నెమరేసుకుంటూ, ఆచరిస్తూ ఉండటమే ఉత్తమ వ్యక్తిత్వ లక్షణమని గ్రహించాలి.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు