బుజ్జి మేక ; డాక్టర్ కందేపి రాణి ప్రసాద్
 బుజ్జి మేక బుజ్జి మేక ఏడికెళ్తవి అంటే రాణీ గారి తోట లోన పూల మొక్కలు మేయటా నికి వెలితిని అని చెప్పటానికి రాణీ గారి అంతఃపురం లో పూల మొక్కలు లేవు.బుజ్జి మేక ఆనందంగా తిరిగే రోజులూ లేవు.గడ్డి తిని బతకాలంటే అడవులు లేవు.క్షణ క్షణం భయం,ఆందోళన లా మధ్య బతుకు బండి సాగుతోంది.ఆదివారం,పండగలు పర్వదినాలు వస్తున్నాయంటే గుండెల్లో దడ, పుడుతోంది.తన జీవితం ఎక్కడ తెల్లవారి పోతుందో అని. టెన్షన్ల జీవితం లో పాటలు ఎక్కడివి? పద్యాలు ఎక్కడివి? ఈ జీవితం ఇంతేనా! ఎవరూ ఈ టెన్షన్లు తగ్గించరా.

కామెంట్‌లు