రాము, సోము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, క్లాస్ మేట్సు. ఒకరిని విడిచి మరొకరు ఒక్క క్షణం కూడా ఉండలేనంత ప్రాణ స్నేహం వాళ్ళది. చిన్నప్పటి నుంచి కలిసి బాగా ఆడుకునే వాళ్ళు. వాళ్ళ మధ్య పోట్లాటలు, కోపాలు ఎన్నడూ లేవు. ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వాళ్ళు. కానీ చదువులో మాత్రం ఇద్దరికీ నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
రాము ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినడం వల్ల ఎన్ని ఆటలు ఆడినప్పటికీ కొద్దిసేపు చదివితే చాలు అన్నీ వచ్చేవి. తరగతిలో ఎప్పుడూ మొదటి ర్యాంకు వచ్చేవాడు. కానీ సోము ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేటప్పుడు సరిగా వినడు సరికదా పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ తరచూ ఉపాధ్యాయుల చేత తిట్లు తినేవాడు. రాము ఎన్నోసార్లు చెప్పేవాడు పాఠాలు శ్రద్ధగా విని, మంచిగా చదువుకోమని. కానీ సోముకు ఈ మాటలు నచ్చకపోయేవి. ఇద్దరూ 8వ తరగతికి వచ్చారు.
ఒకరోజు సోము రాముతో " ఒరేయ్ రాము! ఆ పాండుకు నువ్వు అంటే కుళ్ళురా! ఎప్పుడూ నువ్వు మొదటి ర్యాంకు వచ్చి, వాడు రెండో ర్యాంక్ వస్తుండటం వల్ల నిన్ను చూసి ఓర్వలేక పోస్తున్నాడు. అందుకే నీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు." అని అన్నాడు. "ఒరేయ్ సోము! అదే రెండో ర్యాంక్ నువ్వు వచ్చి ఉంటే ఇంతలా కుళ్ళుకునే వాడివి కాదు కదా! మనం ఇద్దరం అందరి కంటే ముందు ఉన్నామని ఎంతో సంతోషపడేవాడివి. ఒకవేళ నువ్వు మొదటి ర్యాంకు వచ్చి, నేను రెండో ర్యాంక్ వస్తే నేను మరింత సంతోషపడే వాణ్ణి కదా!" అన్నాడు రాము. సోము మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
ఇద్దరూ 9వ తరగతిలోకి వచ్చారు. "ఒరేయ్ సోము! ఇక నుంచి ఇద్దరం కలిసి చదువుదాం. అలాగే నేను ముఖ్యమైన నోట్స్ రాసి నీకు ఇస్తాను. వాటిని బాగా చదువుతూ ఉండు." అన్నాడు. అయినా సోము రాముతో కలిసి చదవడం లేదు. రాము మాత్రం ఇంపార్టెంట్ నోట్స్ రాసి ఇస్తూ వాటిని ఇంటివద్ద రోజూ ఉదయం 5 గంటలకే లేచి చదవమన్నాడు. అలాగే అన్నాడు సోము. కానీ సోములో మార్పు రాలేదు. క్రమంగా రాము సోముతో ఆటలు బాగా తగ్గించాడు. ఎందుకు తగ్గించావు అని అడిగిన సోముతో రాము "వచ్చే సంవత్సరం మనం పదవ తరగతికి వస్తున్నాం. ఇప్పటి నుంచైనా సమయం వృధా చేయకుండా ఎక్కువ సమయం చదువుకు కేటాయిస్తే అత్యుత్తమ మార్కులు వస్తాయిరా. నువ్వు పాటించు." అన్నాడు.
సోములో మార్పు రాలేదు. కానీ ఇద్దరి స్నేహబంధం కొనసాగుతుంది. ఇద్దరూ పదవ తరగతికి వచ్చారు. "సోము! మన ఫ్రెండ్ షిప్ ఈ సంవత్సరంతో ఆగిపోవాలా? లేక చాలా కాలం కొనసాగాలా?" అన్నాడు. "చాలా కాలం కంటిన్యూ కావాలి." అన్నాడు సోము. "అయితే ఈ ఒక్క సంవత్సరం ఎక్కువ కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకో. అందు కోసం నీకు ఎంత సహాయం కావాలన్నా చేస్తాను. ఇద్దరం వచ్చే సంవత్సరం నుంచి కాలేజీ చూసుకొని ఒకే కాలేజీలో చేరుదాం." అన్నాడు రాము. పదవ తరగతి పరీక్షల్లో రాము బెస్ట్ గ్రేడ్ సాధించాడు. సోము చాలా తక్కువ గ్రేడ్ సాధించి కష్టంగా ఉత్తీర్ణత సాధించాడు.
రాముకు మంచి కాలేజీలో సీటు వచ్చింది. సోముకు ఆ కాలేజీలో సీటు రాలేదు. సోము రామును చేరి, "ఒరేయ్ రాము! మనం ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు కదా! ఇప్పుడూ అలానే ఉందాం. నేను చదివే కాలేజీలో నువ్వు చేరవా ప్లీజ్!" అని ఎంతో బ్రతిమాలాడు. "చూడు సోము! మనకు అందరి కంటే ప్రాణ స్నేహితులు మనం చదువుకునే చదువే. దాన్ని ఎంత కాపాడుకుంటే మనకు అంత గొప్ప భవిష్యత్తు ఉంటుంది. మనల్ని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడే అత్యుత్తమ స్నేహితులు మనం సాధించుకునే విద్యనే. కాబట్టి నాకు ఆ విద్యనే ముఖ్యం. నిన్ను ఎన్నోసార్లు మార్చాలని చూశాను. కానీ నువ్వు నా మాటను పెడచెవిన పెట్టావు. ఫలితం అనుభవించాల్సిందే. ఇక నుంచి అయినా నువ్వు చదువుకునే కాలేజీలో అయినా మంచిగా చదవడానికి ప్రయత్నం చెయ్యి. ఇదే నేను నీకు చెప్ఫే చివరి మాట. నీ కోసం నేను కష్టపడితే వచ్చిన బంగారు అవకాశం వదులుకోను. నా మాట నువ్వు వినలేదు. నీ కోసం నేను త్యాగాలు చెయ్యలేను. నాకు శాశ్వత స్నేహితులు విద్యనే." అని వెళ్ళిపోయాడు రాము. సోము ఎంతో కుమిలిపోయాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి