సుప్రభాత కవిత ; బృంద
కరకు కాలం  కరిగిపోతూనే
ఉంటుంది 

లాభ నష్టాలు దానికి లేవు

సుఖదుఃఖాలు అసలు లేవు

గాయాలు మాయలు తెలియవు

మనసుంటే మమతలు తెలిసేది

ప్రేమ వుంటే  జాలి  ఉండేది.

సాయం చేసే మనసుంటే
కనికరించేది.

అవినీతికి అర్థం తెలిస్తే
కాలం కలిసి వచ్చేది కాదేమో!

అధికారము అహంకారము
తెలిస్తే....అదుపు చేసేదేమో!

కలతలు కన్నీళ్లు తెలిస్తే
కళ్ళు తుడిచేదేమో!

నీరు నిండిన మబ్బులు
తనలోనే ఉన్నా అసలు తడవని
గగనంలా

తనకేం పట్టనట్టు సాగిపోయే
కాలచక్రంలో మరో రోజు

తెలియని  వరాల మూట
తెస్తోందేమోనని ఆశగా

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు