సుప్రభాత కవిత ; -బృంద
దిగివచ్చిన కాంతిరేఖలు
ఒడిసిపట్టిన గడ్డిపువ్వులు

రేయంతా మెరిసిన చుక్కలు
వెలుతురుకు భయపడి 
మొక్కను చేరిన చందం

వెలుగుల వసంతం
దివినుండి  ప్రసరింప
కలవరపడి కనుమరుగైన
చిక్కని తిమిరాలు

నిశ్శబ్ద  నిద్రలో
కనులు కన్న మేలిమి
స్వప్నాల మూటలా....

నులివెచ్చని వేకువతెచ్చిన  
విలువైన బహుమతిలా

మాయమైన చుక్కల్ని
నేలపై చూసి తెల్ల బోయిన
మేఘమాలల  మధ్యన

తూరుపు ముంగిట
విరిసే వెలుగుపువ్వు

నింపెను పుడమి  పెదవులపై
మెరుపుల నవ్వు...

అబ్బురమైన ఉదయానికి
ఆనందం నిండిన మదిపాడే
భావగీతం

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు