పరితోషించు...పరిపోషించు
*****
అన్ని జీవులకన్నా అత్యంత ఉత్కృష్టమైనది మానవ జన్మ. ఇలాంటి గొప్ప జన్మ లభించినందుకు ఎల్లప్పుడూ పరితోషించాలి.
పరితోషించు అంటే మిక్కిలి ఆనందించు లేదా సంతోషించు,హర్షించు అని అర్థం.
పరితోషించడం అనేది మన మనసుకు సంబంధించిన విషయం.
మనం చేస్తున్న పనిలో విజయం సాధించినప్పుడో, మనం అనుకున్నది జరిగినప్పుడో మిక్కిలి సంతోషం కలుగుతుంది.
పరిపోషించు ' అనే పదాన్ని కాపాడు, రక్షించు, ఎక్కువగా పోషించు అనే అర్థంతో వాడుతాం.
మరి వేటిని పరిపోషించాలి, వేటిని రక్షించాలి, కాపాడాలి అనే సందేహం కలగొచ్చు.
మానవీయ విలువలను, న్యాయాన్ని, ధర్మాన్ని రక్షిస్తూ, అనుబంధాలు, బంధాలను కాపాడుకోవాలి.అప్పుడే పరితోషించుట అనేది సార్థకం అవుతుంది.
కాబట్టి పరితోషణకై సదా పరిపోషణ చేద్దాం. మానసిక తృప్తిని నిండుగా మెండుగా పొందుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి