శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ

 లంగరు వేయడం అంటే పడవని ఓచోట ఆపటం అనే అర్ధంలో వాడుతున్నాం. అసలు లంగరు అంటే లోహంతో తయారైన చాలా పెద్ద  కాంటా అంటే ముల్లు లాంటి దాన్ని  నది సముద్రంలో వదిలి నావ ఓడలని ఆపుతారు.ఆంగ్లం లో యాంకర్ అంటారు. ఇక చాలా మంది ఒకప్రాంతంలో కూడి కలిసి వంటచేసి భోజనం చేయటం నికూడా లంగరు అంటారు. సిక్కు మతస్థుల గురుద్వారాలో ఈకలిసి భోజనం చేసే ఆచారం ఉంది. బఘేలీ భాషలో లాంగర్  పదం లంగడా నించి వచ్చింది.సంస్కృతం లో లింగ్ అంటే చిహ్నం గుర్తు! శివుని లింగాకారంలో నిరాకార నిర్గుణరూపంలో కొలిచి అభిషేకాలు చేస్తాం.ప్రాచీన అరబ్ జపాన్ ఈజిప్టు రోం గ్రీస్లో లింగారాధన ఉంది. జగత్తు కి మూలం లింగం అని  స్రష్ట  జగత్పిత ని ఈలింగాకారంలో అర్చించేవారు.కాబూల్లో ప్రాచీన ఆలయాల్లో ఇలా అనేక లింగాలు ఉండేవి. వైదిక కాలంలో  అనేక అనార్య భారతీయ జాతుల్లోలింగ పూజ  విధిగా ఉండేది. మన దేశంలో నిష్క్రియ నిర్గుణ శివ అంటే అలింగం అని  రెండోదిజగత్ ని ఉత్పత్తి చేసే లింగం అని దీన్ని పూజిస్తాం. ఇక బంగారు వెండిచిన్న లింగాలను తేలిగ్గా ఎక్కడకైనా తీసుకుని వెళ్లవచ్చు. పాషాణంతో చేసినవి పెద్ద పెద్ద భారీ లింగం ని అచరలింగం అంటాం.
కామెంట్‌లు