విజ్ఞాన పంజరంలో...
బాల్యవినోదం
బందీఐపోయింది !
స్వేచ్చావిహంగంలాంటి.
బాల్యావస్థ... సెల్లుకే...
పరిమితమైపోయింది !!
ప్రపంచాన్ని దరికి జేర్చి...
తనని ప్రపంచానికి...
దూరం చేసేస్తోంది... !
మెదడు అలసిపోతూ...
శరీరావయవాల నన్నింటినీ
సోమరిపోతులను...
చేసేస్తోంది... !
శ రీ రాన్నంతటినీ....
రేడియేషన్ తో నింపేసి...
స్వశక్తిని పీల్చి...
పిప్పిచేసేస్తోంది... !
మనుషులని...
మనుషుల్లా కాక...
రోబోలను చేసి...
ఆడిస్తోంది... !
కృతకానంద మాయతో...
సహజానందాన్ని...
హరించేస్తూ...
మనిషిని వాడుకుని...
ఆడుకుంటోంది విజ్ఞానం!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి