*సిని 'మా(య)*;- *వెల్మజాల నర్సింహ*
తళ తళ మెరిసే తారలు 
తడిమి చూస్తే మాయలు

తెరపై కనిపించే అందాలు 
తెర వెనుక చీకటి కోణాలు 
జగతకిి మనోరంజకం
 సినిమాయ

అబద్దల కల్పిత  అద్దం 
 మాయ గారడీల అందం 
24 ఫ్రేముల కష్టం 
మనసును దోచుకున్నే
మాయల వలయం సినిమాయ 


తోలుబొమ్మలాట లో లేవు 
మెాసాలు 
ఆకథలు తీర్చే మన
కన్నీటి కష్టాలు 
క్షయగానం, హరి ,బుర్ర కథలు 
నేడు కనుమరుగైయే సినిమాయ

పిల్లలు పెద్దలు యువతి 
యువకులు 
పనిలో గనిలో 
వాహనాలలో
ఎక్కడా చుాసిన సినిమాయే 


విజ్ఞానం కొంతైతే 
వినోదం మరెంతో 

కత్తికి రెండు వైపుల
 పదునుల
 చీకటి కోణం మరెంతో 

బడాబాబుల పుణ్యం 
బలైపోయే అబల జీవితం 

మాదకద్రవ్యాల అలవాటు 
మనకోసం వారి తెరవెనక
 అగచాట్లు

ఏదైతేనేం మనకు ఆనందం 
అదే మాయల అనుబంధం

నవరస భరితం 
నడిపించే *సినిమా(య)* 


కామెంట్‌లు