ముల్లోక దవము
సిరిని దాల్చు స్వామి కరికి వేల్పు
విరుల సరుల స్వామి వేదాంత వేద్యుడు
వేంకటేశ విభుడు వేదమూర్తి
సప్త గిరులస్వామి సంకట సంహారి
దీన జనుల గాచు దివ్య మూర్తి
చేదు కొమ్మని యన్న చేకొను దైవము
వేంకటేశ విభుడు వేదమూర్తి
పూల తేరు వాడు బుడమి దైవమితడు
పునుగు బూత వాడు పుణ్య శాలి
దయను రూపు దాల్చు ధర్మమీ దైవము
వేంకటేశ విభుడు వేద ముర్తి
అవని జనుల గాచు ఆనంద నిలయుడు
ముడుపు లందు స్వామి మోహనుండు
కోరు వరము లిచ్చు గోపాల కృష్ణుడు
వేంకటేశ విభుడు వేదమూర్తి
కృష్ణు డైన యతడె కేశవనాముండు
శక్తి రూపు డతడె శంఖు దారి
రూపమేది యైన రుక్మిణీ నాధుడే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి