...* మీరునూ... *;- కోరాడ నరసింహా రావు !

 ఎల్ల కాలమొక రీతి నుండబోదు 
అణగ ద్రొక్కబడ్డ వారికే .... 
తమను పాలించు అధికారము!
పాలించు వారు... 
   పాలింప బడుదురు... !
 పాలించబడ్డవారు.... 
    పాలకులై  ఏలుదురు... !!
వంచించువారు... 
    వంచించబడుదురు !
 ద్వేషించి, దూషించువారు... 
  ఏనాటికైనను బదులుతీర్చక 
   తప్పదు కదా... 
 కనుకనే... 
   సాటిమనిషిని, ఈ ప్రపంచా న్ని... ప్రేమించి, సేవించండి !
 తత్  ఫలముగా... మీరునూ 
 ఈ ప్రపంచముచే... 
ప్రేమించబడి,సేవించబడుదురు
      ******
కామెంట్‌లు