కథల పోటీల్లో బహుమతి

  మెదక్ జిల్లా  రామాయం పేట మండల పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల రాయలాపూర్  విద్యార్థిని కె. రేవతి , (పదవతరగతి) పెందోట బాల సాహిత్య పీఠం_2022 సిద్దిపేట వారు నిర్వహించిన కథల పోటీల్లో  ప్రోత్సాహక బహుమతి సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డిఈఓ చేతుల మీదుగా నగదు బహుమతి, సన్మానం, ప్రశంసా పత్రం  ఇవ్వడం జరిగింది.విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాషా ఉపాధ్యాయులు చంద్రకాంత్ గౌడ్ గారిని ప్రత్యేకంగా అభినందించారు  ఈ సందర్భంగా విద్యార్థిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, గ్రామ సర్పంచ్, ఎంపిటిసిలుఅభినందించారు.

కామెంట్‌లు