తోట ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 రాజుగారి ఊరిలోన 
తోట ఉండెను 
తోటలోన బోలెడన్ని
పూవులుండెను 
పూవులతో తోటకు 
అందమొచ్చెను 
అందమైన తోటలోకి 
పాప వెళ్ళెను 
తోటంతా హాయిగా 
కలయ తిరిగెను 
తోటలోని పూలను 
కోసి తెచ్చెను 
పూలన్నీ మాలచేసి 
జేజకేసెను !!

కామెంట్‌లు