సుప్రభాత కవిత ; -బృంద
గగనం భువనం కలిసే
సంగమ ప్రాతః సంధ్య....

మదినిండిన మౌనం లాటి
చీకటిని
రాగాలాపనలతో ప్రణయగీతంగా
మార్చే వేకువ

వసంతాలను సొంతం చేసే
మందహాసాలు విరిసే ఉదయం...

ఎదలోతుల అదిమిన
మమతలు
తుమ్మెదలై చుట్టుముట్టే వెలుతురు

ఊగుతూ పువ్వులతో
పన్నీరు చిలకరించే
విరితీవెల వయ్యారాలు...

నింగీ నేలా చేసే స్నేహం
మౌన గంధాల పరిమళం

నింగి నుదుట సింధూరము
అలదిన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు