నాయకులారా ! తస్మాత్ జాగ్రత్త!!;-" కావ్యసుధ "సాహితీ సేవా రత్న అవార్డు గ్రహీత సీనియర్ జర్నలిస్ట్ విశ్రాంత
 నాయకులు బిచ్చగాళ్లు !                              
  ఓటర్లను ప్రలోభ పెడుతున్న                            
లుచ్చాగాళ్లు !
నాయకుల నాడి
ప్రజలకు తెలుసు
నాయకులకి ఏం తెలుసు                             
పచ్చిపులుసు
ఓట్ల కోసం....
పొర్లు దండాలు పెడతారు
పాదాభివందనం చేస్తారు
మరి....
ఈనాటి ఓటర్లు పిల్లులు కాదు
ఊసరవెల్లులు కాదు.
నాయకుల నీటి మాటలు నమ్మి                              
 మోసపోయే వారు కాదు
సబ్కా సున్నా
అప్నా కార్న్ ఉర్దూ సామెత 
అందరి మాటలు వింటారు
ఎవరికి ఓటు వేసి
గెలిపించాలో పల్లె సీమ                              
ఓటర్లకు బాగా తెలుసు
ఓటర్లిప్పుడు............                           
 చైతన్యవంతులయ్యారు
చెత్త నాయకులకు
ఓట్లు వేసి గెలిపించారు.
తస్మాన్ జాగ్రత్త నాయకుల్లారా !
మీ కల్లబొల్లి మాటలు                              
నమ్మేవారు లేరు...
డబ్బులు పంచి,                             
మద్యపానములో దించి
ఓట్లు దండుకోవాలని
చూసే నాయకులారా !!
పదవుల కోసం ఎంత నీచానికి
 దిగజారిపోతున్నారు
దేశానికి సేవ చేసే
నాయకుల లక్ష్యం ఇదేనా ?
మీకు తెలియడం లేదా 
ప్రజలు ఇప్పుడు
నిలబెట్టి అడుగుతున్నారు
తిరగబడుతున్నారు.
ప్రజలకు సేవ చేసే నాయకు
డేవరో బాగా తెలుసుకున్నారు
ఇకపై మీ ఆటలు సాగవు 
తస్మాత్  !  జాగ్రత్త !!

కామెంట్‌లు