కాకూడదు... !;-చిత్ర కవిత --కోరాడ నరసింహా రావు.

 ఆమె లో   అతను...!
  అతనితలపుల నిండాఆమె !!అతనికి ఆమే ప్రపంచం !
.  ఆమెకు అతనే  సర్వస్వం !!
 వీరిరువురే  మానవ  జాతి... 
    విస్తృతికి మూలం !
 ఎడముఖం...పెడముఖం ఐతే 
 చిన్నబోదా... సృష్ఠి... !
కళా విహీనమే  కదా ప్రకృతి !!
 స్త్రీ,పురుషులెపుడూ ఆకర్షించే 
అయస్కాంత ధృవాలు కావాలే గానీ వికర్షించేవ్యతిరేక దిక్కులు
కాకూడదు.... !
      ********
కామెంట్‌లు