కందం:
*శ్రీ భామినీ మనోహరు*
*సౌభాగ్య దయా స్వభావు సారసనాభున్*
*లోఁభావించెద; నీకున్*
*వైభవము లొసగుచుండ వసుధఁగుమారా !*
తా:
లక్ష్మీ దేవి మనసు దోచుకున్న వాడివి, నాభిలో పద్మమును ఉంచుకుని దయ చూపుతూ అన్ని సంపదలను ఇచ్చే స్వభావము గలిగిన వాడివి, అయిన నిన్ను మనసులో పూజిస్తూ, నమస్కారాలు చేస్తూ, కుమారుడా! ఈ భూమి మీద పుట్టిన నీకు ఆపరమాత్ముడు నీకు కూడా ఆయురారోగ్య, సంపదలను ఇవ్వమని ప్రార్ధిస్తున్నాను.... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*కుమారా! ఎవరి కుమారుడు? ఈ చరాచర ప్రపంచంలో పుట్టిన ప్రతీ మగ జీవి / పురుషుని దృష్టిలో వుంచుకుని, ఆ కుమారుని మంచి కొరకు పరమేశ్వర, పరాత్పర, నిరాకార, నిర్గుణ, నిరంజన రూపాన్ని ప్రార్ధన చేసారు. ఈ సమాజంలో ఉన్న కుమారులు అందరికీ, చక్కని ఆరోగ్యం ఉంటే, సమాజ ఆరోగ్య పరిస్థితి కచ్చితంగా మారుతుంది కదా! వీరందరికీ సంపదలు రావలసిన మేరకు వస్తే, సమాజం ఆర్ధిక స్థితి మారుతుంది కదా! అలాగే, ఈ మన సమాజంలో కుమార వ్యవస్థ లో ఉన్న కుమారులు అందరూ, భక్తి ప్రపంచంలో కి అడుగు పెట్టి, నామ మహాత్యంతో ముందుకు వెళ్ళే స్థాయికి చేరితే సమాజానికి జరిగే మేలును మనం ఎవరమూ అంచనా వేయలేము. ఇక్కడ ఉన్న కుమారులు అందరూ మంచి నడవడిక కలిగి, తమ వైపు ఇంకొకరు వేలు చూపకుండా ఉండేలా ఉండగలిగితే, సమాజం యొక్క మానసిక స్థితి మెరుగుపడి మెరుగైన సమాజం ఏర్పడుతుంది. ఈ విధమైన మంచి ఆలోచనలను గలిగిన సమాజ నిర్మాణం జరగడానికి పరమేశ్వరుడు మనకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆశిస్తూ, ఉండాలని కోరుకుంటూ.... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి