జగతికి వెన్నెముక స్త్రీ (3);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నవమాసాలు మోసి బిడ్డను భూమి మీదకు తెచ్చిన మాతృమూర్తి  ఆ పసిగుడ్డును చూడగానే పొందిన ఆనందం జీవితంలో మరి ఎప్పుడు పొందదు. ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ అమ్మ చంటి బిడ్డ చిరునవ్వు చూడగానే బాధలన్నిటినీ మరిచిపోయి  స్వర్గలోకంలో ఉన్నట్లుగా భావిస్తోంది ఈ బిడ్డ వల్లనే కదా నేను మాతృత్వాన్ని పొందింది. ఆ బిడ్డ లేకపోతే నాకు అమ్మతనం లేదు కదా అని ఆ బిడ్డ పై  ఎనలేని ప్రేమ ను  వాత్సల్యాన్ని  పెంచుకుంటుంది.  అల్లారుముద్దుగా పెంచుతుంది ఆ బిడ్డ ప్రతి అవసరానికి మించి జీవితానికి జీవిగా ప్రవర్తిస్తోంది. ఆ బిడ్డ కాలికి  దెబ్బ తగిలితే తన కంటిలో ముల్లు గుచ్చుకున్నట్లుగా బాధపడుతుంది. అలాంటి అమృతమూర్తి అమ్మను  మనం మమ్మీలను చేసి ఆడిస్తున్నాం ఆ శబ్దానికి అర్థం తెలిసి అంటున్నారో తెలియకంటున్నారో ఎవరికీ  తెలియదు.
చాలా కాలం క్రితం ఈజిప్ట్ రాజులు పిరమిడ్లను కట్టి  దానిలో మణులు, బంగారం లాంటివి పెద్ద పెట్టెలో పెట్టి దాచి ఒక శవాన్ని తీసుకొని వచ్చి దాని పైన పెట్టి ఆ శవం పైన యాసిడ్ పోసేవారు. అది కుళ్ళి పోయిన తర్వాత  అక్కడ ఎవరైనా దొంగలు ఆ పెట్టె తెరిస్తే ఆ విష వాయువు  కు చనిపోయేవారు  ఆ శవం  ఊరి భూతం లాగానో దయ్యం లాగానో తయారైన ఆకారాన్ని  మమ్మీ అంటారు. మరి అమ్మను అలా అనడంలో అర్థం ఏమిటి. అంత అసహ్యంగా ఘోరంగా ఉంటుందా అమ్మ?  ఆ పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే బాగా తెలివైనవాడు చురుకైన వాడు అందగాడు  ఆర్థికంగా వెనుకబడిన వాడిని  తీసుకువచ్చి చదివించి ప్రయోజకుణ్ణి చేసి పెండ్లి కాదు అని అనుకున్న తన  కూతురినే  అంటగట్టిన తర్వాత అతని పరిస్థితి ఏమిటి? మనసులో ఉన్న కోపాన్ని ఎలా ప్రదర్శిస్తాడు  తనకు బిడ్డలు పుట్టిన తర్వాత  వారితో తన భార్యను మమ్మీ అని పిలిపించుకుని ఆనందిస్తాడు అలా ఆ శబ్దం ఆవిర్భవించింది అని నేను అనుకుంటున్నాను. అమ్మ అన్న పిలుపు ఎంత కమ్మగా ఉంటుంది  ముందు అమ్మకు అర్థం తెలిస్తే మనకు పుట్టుకనిచ్చింది కనుక జనని అంటాం కానీ ఎన్ని అక్షరాలు కలిస్తే అమ్మ శబ్దం ఏర్పడుతుంది. అ- మ- మ- అ అన్న నాలుగు అక్షరాలు కలిస్తే అమ్మ. మొదట్లో చివర్లో ఉన్న  అకారం అంటే సృష్టి  నిరంతరం స్రవంతి లాగా వెళ్ళిపోతుంది. మధ్యలో ఉన్న మమ అంటే అహం. అహం బ్రహ్మాస్మి అన్నది సూక్తి  బ్రహ్మ పదార్థం అంటే అణువు అని అర్థం రేణుక అమ్మవారు రేణుకతో సృష్టించబడింది అని చెప్తారు కదా. అలాంటి రేణువు పదార్థంతో కూడిన మాతృమూర్తిని నీకు  ప్రాణం పోసిన అమ్మను  నిర్జీవంగా ఉన్న భూతాకారంతోనో  దయ్యం ఆకారంతోనో ఉన్న  పదార్థంతో పోల్చి చెప్పడం, పిలవడం మానవత్వం ఉన్న మనిషి చేసే పనేనా అని ఆలోచించుకుంటే పి హెచ్ డి చేసిన ఆడవారు కూడా మమ్మీ అని పిలిపించుకుంటున్న ఈ స్థితిని  మనం మార్చగలమా అనిపిస్తుంది మనసుకు.కామెంట్‌లు