గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు (49);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మరొక మంచి ఆట  బాగా ప్రాచుర్యం పొందినది దీనిలో పాములు నిచ్చెనలు ఉంటాయి.దీనిని వైకుంఠ పాళీ అంటారు. నాలుగు గవ్వలు తీసుకొని పందెం వేస్తారు.  ఆ పడిన పందానికి అనుగుణంగా  అతను పెట్టిన కాయిన్స్ కదులుతూ ఉంటాయి. అది నిచ్చెన దగ్గరికి వెళ్లి ఆగితే పైకి వెళుతుంది లేదూ పాము నోటి దగ్గర ఆగిపోయినట్లు అయితే అది కిందకు వస్తుంది. ఇలాంటి ఆటలలో అందెవేసిన చేయి మన  శివనాగిరెడ్డి గారు. చూడడానికి చిన్న ఆటగా ఉంటుంది కానీ మానసికంగా ఆలోచించినప్పుడు లక్ష్యాన్ని చేరుకోదలచుకున్న సాధకుడు చేసే ప్రయత్నం. ఆ క్షణాలలో ఆడిన ఆట అదే అతని జీవిత లక్ష్యాన్ని ఏర్పరిచింది. ఈ ఆటలో ఉన్న ముఖ్య లక్షణం  సహకారం పచ్చి విరోధులుగా ఉన్నవారు కూడా ఈ ఆట సమయంలో మంచి మిత్రులుగా మారి ఆ ఆట లక్ష్యాలను  దృష్టిలో పెట్టుకొని  ఆడి నాయకుడు ఎలా చెబితే అలా ప్రవర్తిస్తారు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి ఈ సమానత్వం బయట కూడా ఉంటుంది  ఒకడు ఏదో ఆపదలో ఉన్న సమయంలో మిగిలిన వారంతా అతనికి అండగా నిలుస్తారు  ఆ చిన్నతనంలో ఏర్పడిన స్నేహం జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది. నిజంగా వైకుంఠపాళి ఆట ఆడేటప్పుడు  మనసును దాని మీద కేంద్రీకరించి ఆడాలి  దృష్టి అటూ ఇటూ మళ్ళినా పందెంలో అపజయ పాలవుతాడు.  ఇలాంటి వాటికి అలవాటు పడ్డ వాడు కనుకనే శివ నాగిరెడ్డి గారు పెరిగి పెద్దవారయిన తరువాత కూడా పరోపకారంలో ఉన్న సుఖాన్ని అనుభవిస్తున్నారు. తన పని ఒదిలి అయినా ఇతరులకు కావలసిన మంచి పని చేసి పెడతారు. ఇలా పెరగడానికి ఆనాడు  బాల్య స్నేహితులు ఇచ్చిన  భరోసా ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీవితంలో మనకు తెలియకుండా ప్రతి జీవికి కళాత్మక దృష్టి ఉంటుంది  ఆ కోరిక ఉన్నట్లుగా కూడా అతనికి తెలియకపోవచ్చు చిన్నపిల్లలని మనం చూస్తున్నప్పుడు వారు చేసే పనులు,  చిలిపి చేష్టలు చూసి అర్థం చేసుకొని పెద్దవాళ్లు దానికి సంబంధించిన విద్య ఏదైతే ఉన్నదో దానిని నేర్పినట్లయితే అతను జీవితంలో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాడు  శాశ్వత కీర్తి  ఈ ప్రక్రియ ఐదు సంవత్సరాలలోపు ఇంట్లో జరగకపోతే అది ప్రాథమిక పాఠశాలలో జరగాలి. అలా జరగాలంటే  ఉపాధ్యాయులతో సన్నిహిత సంబంధాలను పెట్టుకోవాలి. వారు చెప్పే ప్రతి మాట విని ధారణ చేసి దానిని సాధన చేస్తూ ఉంటే  తప్పకుండా ఆ విద్యార్థి గొప్పగా రాణించగలరు అనడంలో ఎలాంటి భిన్న అభిప్రాయాలు లేవు.

కామెంట్‌లు