ఎవరైనా రెండువైపులా నష్టపోతే దానిని ఉభయభ్రష్టత్వం అంటారు. అలా నష్టపోయిన వారిని రెంటికీ చెడిన రేవడు అని అంటూ వుంటారు. రేవడు అంటే రజకుడు. రేవులో బట్టలు వుతికి శుభ్రపరుస్తుంటాడు కాబట్టి రేవడు అనే పేరు వచ్చింది. ఇంతకీ ఈ జాతీయంలో రేవడు ఎందుకొచ్చాడో తెలుసుకోవాలంటే ఒక చిన్న కథ వుంది... వినండి.
ఒకసారి ఒక రజకుడు రేవులో బట్టలు వుతకసాగాడు. సగం వుతికాక వాటిని తీసుకోని పోయి గట్టుమీద ఆరేసి మరలా రేవులోనికి దిగి మిగతా వాటిని వుతకసాగాడు. అంతలో అనుకోకుండా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. గట్టుమీద ఆరేసిన బట్టలు సుడిగాలిలో చిక్కుకొని గాలిలోకి ఎగిరాయి. అది చూసి ఆ రజకుడు అదిరిపడి వుతుకున్న బట్టలు ఎక్కడివక్కడ వదిలి పెట్టి, గట్టుమీదకెక్కి ఆ సుడిగాలి వెంట పరుగుదీశాడు.
అంతలో అనుకోకుండా ఏరు పొంగడం మొదలు పెట్టింది. పై నుంచి పెద్ద ఎత్తున నీళ్ళు రాసాగాయి. అది చూసి రేవులో బట్టలు వుతుకున్న మిగతా వాళ్ళందరూ గట్టిగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఎవరి బట్టలు వాళ్ళు వేగంగా మూట గట్టుకోసాగారు. ఆ అరుపులు విన్న ఆ రజకుడు అదిరిపడ్డాడు. గట్టుమీద గాలికి ఎగిరిపోతున్న బట్టలని అలాగే వదిలేసి వేగంగా ఏట్లోకి వురికాడు. కానీ అతను వచ్చేలోపల నీళ్ళలో బట్టలన్నీ కొట్టుకొని పోయాయి.
అట్లా గట్టుమీద గాలికెగిరిన బట్టలూ దొరకలేదు. ఇట్లా ఏట్లో నీళ్ళలో కొట్టుకుపోయిన బట్టలూ దొరకలేదు. రెండూ పోయి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పాపం వుత్త చేతులతో విచారంగా నిలబడిపోయాడు. అలా రెండు వైపులా నష్టపోవడం నుంచే ఈ రెంటికీ చెడిన రేవడు అనే జాతీయం పుట్టింది.
**********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి