బాల పంచపది
===========
1. శరదృతువు రెండు,
మాసాలు !
ఆశ్వయుజ, కార్తీక,
మాసాలు!
ఆశ్వయుజం అమ్మవారి ,
పూజలు !
కార్తీకం అయ్యవారి,.
అర్చనలు!
ప్రకృతి చల్లన ,
దీపం వెచ్చన, రామా!
2. ఆశ్వయుజ ,
ఆయుధ పూజలు !
నవరాత్రుల,
నవ అవతారాలు!
బతుకమ్మ ,
ఘన జాతరలు!
జనాన,
దసరా సరదాలు!
ప్రకృతి చల్లన,
దీపం వెచ్చన, రామా!
3. కార్తీకం దీపావళికి,
స్వాగతము!
కార్తీకమంతా దీపాల,
స్వగతము!
శివకేశవుల ,
ఆరాధనము.!
హరిహర,
సమన్వయము!
4. శరత్ కాలం ,
కవిత కాలము!
కవిత్వం వెన్నెలై,
కాచేకాలము!
నదుల నీళ్ల ,
పవిత్ర స్నానము!
తీర్థయాత్రల ,
సరి సమయము !
ప్రకృతి చల్లన ,
దీపం వెచ్చన, రామా!
5. పిల్లల దసరా,
సరదాలు!
చేత విల్లంబులు,
నోట పద్యాలు!
అయ్యవారికి ,
ఐదు వరహాలు!
పిల్లలందరికీ
పప్పుబెల్లాలు!
ప్రకృతి చల్లన ,
దీపం వెచ్చన, రామా!
6. అంధకారంపై ,
దీపాల విజయము!
నరకాసుర ,
సంహారము!
బాణసంచాల,
ప్రతాపము,!
పిండి వంటల ,
మాధుర్యము!
ప్రకృతి చల్లన,
దీపం వెచ్చన, రామా!
7. కార్తీక పిక్నిక్ ,
సమావేశాలు!
సోమవారాలు,
ఉపవాసాలు !
ఇళ్లల్లో గుళ్ళల్లో ,
అభిషేకాలు!
హర హర మహాదేవ,
నినాదాలు!
ప్రకృతి చల్లన,
దీపం వెచ్చన ,రామా!
8. శరత్ పూర్ణిమ ,
అందాల జాబిల్లి!
నేల మీద,
వెన్నెల విరజల్లి!
జగమంతా,
రజతశోభలల్లి !
మనకి ,
ఆనందాల పాలవెల్లి!
ప్రకృతి చల్లన ,
దీపం వెచ్చన, రామా!
_________
ప్రకృతి చల్లన! దీపం వెచ్చన!;=డా. పి.వి.ఎల్. సుబ్బారావు,9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి