పూర్వం మందరుడను పేద బ్రాహ్మణుడు అడవికి సమీపంలోని ఉన్న గ్రామంలో నివసిస్తుండేవాడు. అతను బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సందెలు విడిచి కూలి పని చేస్తూ తన భార్య సుశీలతో జీవిస్తుండేవాడు. అతని భార్య శుచి శుభ్రత,మడి పాటిస్తున్న సాముద్రిక లక్షణములు గల ప్రతివ్రత శిరోమణి. ఆమె భర్త దుర్గుణములు కలవాడైనా అతనిని ద్వేషించక సదా సేవిస్తుండేది. మందరుడు కూలి జీవితము కష్టమని భావించి అడవి మార్గము గుండా వచ్చి పోయే ప్రయాణికులను దోచుకుంటూ ఆ సొమ్మును ప్రక్క ఊరికి తీసుకువెళ్లి అమ్మి వచ్చిన ధనముతో కుటుంబ పోషణ గావించసాగాడు.
ఒకరోజు ఇంకొక బ్రాహ్మణుడు అడవి గుండా దారిలో వస్తుండగా అతనిని ఒక చెట్టుకు కట్టి అతని వద్ద ఉన్న ధనమును మందరుడు కాజేశాడు. ఇంతలో ఇంకొక కిరాతకుడు వచ్చి మందరుని, బ్రాహ్మణుని చంపి ఆ ధనమును తాను దోచుకున్నాడు. కిరాతకుడు ధనమును తీసుకొని దారిలో పోవుచుండగా ఒక క్రూర మృగం అతనిపై దాడి చేసి చంపి అది కూడా చనిపోయింది. అలా ఇద్దరు బ్రాహ్మణులు, కిరాతకుడు, క్రూర మృగం వీరంతా చేసిన పాప ఫలముల కారణముగా నరకాన్ని పొందినారు. నరక లోకంలోని యమభటులు నానా విధములుగా నరకయాతనలు పెట్టసాగారు.
భర్తను కోల్పోయిన సుశీల సమస్త ధర్మములను ఆచరిస్తూ, పతిథ్యానము చేసుకుంటూ కాలాన్ని గడుపుతుంది. ఒక రోజున ఒక యతీశ్వరుడు సుశీల వద్దకు రాగా అతిథి సత్కార్యములు చేసి మీ వంటి వారి రాక వలన మా గృహము పావనమైనది. నాకు నా పతిని పొందే మార్గంను, మోక్ష ప్రాప్తిని పొందే మార్గమును చెప్పు మని ప్రార్థించినది. ఆమె ప్రార్థనను విన్న యతీశ్వరుడు ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వము. ఈరోజు ఇంట్లో హరి సన్నిధిలో ఎవరైతే పురాణ పఠణం చేస్తారో, వింటారో, దీపారాధనతో హరిని పూజిస్తారో వారు ముక్తిని పొందుతారు అన్న యతీశ్వరుని మాటలు విని సుశీల తన ఇంటిని గోమయం చేసి అలికి శుభ్రం చేసి స్నానము ముగించి హరి విగ్రహం ముందు దీపాన్ని వెలిగించి పూజించింది. యతీశ్వరుని పురాణ పఠనమును శ్రద్ధతో విన్నది.
ఇలా ఉండగా కొంతకాలానికి సుశీల కూడా దివంగతురాలయింది. విష్ణు దూతలు సుశీలను హరిపూజ ఫలముచే విష్ణు లోకమునకు తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యంలో ఇద్దరు బ్రాహ్మణుల, కిరాతకున్ని, క్రూర మృగాన్నినరకలోకంలో నరకయాతనలు పడుతున్న వారిని చూచి, దూతలతో మహానుభావులారా! ఇందులో నా భర్త ఉన్నాడు. అతనికి స్వర్గలోక ప్రాప్తికై ఉపాయము చెప్పుమని అడిగినది. అప్పుడు యమదూతలు నీవు కార్తీక మాసంలో పురాణ శ్రవణము వల్ల వచ్చిన ఫలమును నీ భర్తకు దానం ఇస్తే అతను స్వర్గలోకాన్ని పొందుతాడు అనిన వారి మాటలు విని సుశీల పురాణ శ్రవణము వల్ల వచ్చిన పుణ్యఫలమును భర్తకు ధార పోసినది. భార్య పుణ్యఫలమును పొందిన మందరుడు విష్ణు లోకంను పొందాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి