శ్రమే శక్తిగా;-(గజల్)-డా.టి.రాధాకృష్ణమాచార్యులు--హైదరాబాద్--9849305871.
ఎవరికోసం ఎవరొచ్చారో నడువనీ  యాత్ర
మనిషి కోసం మనిషొచ్చేనా అడిగెనో నేత్రి

మనసు నేస్తం కలిసి కదలగా విరిసింది కాంతి
మనుషులంతా మురిసి ఆడగా వెలిసింది శాంతి

ఇరుగు పొరుగున పనులు పాటలైన నవ్వే నువ్వై
తోడునీడైన మధుర జీవనం సాగెనో గాత్రి

చెలిమి తోడైన సుందర యాత్రలో
ప్రాణం చెట్టైన 
చెలిమె‌ దాహమే తీరిన 'సితారా'
వెలిగింది రాత్రి

బతుకు బాటైంది వాగూ వంకలో
ప్రవాహ వర్షమె
కాదిది మౌన సమాజం,శ్రమే శక్తిగా
తిరుగనీ ధాత్రి


కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Excellent, the poet's social consciousness of both the rustic and urban life and mastery over the form of Gazal and diction suitable to the readers of all types is wonderful.Congrats to the poet Sri Dr.T Radhakrishnama charyulu.