వెన్నెల రాత్రి
పాల ధారలా
కురుస్తున్న జాబిలి
వెలుగులు,
మందంగా చల్లగా
మెల్లగా వీస్తున్న
శిశిర గాలి,
విచ్చుకున్న పువ్వుల
పరిమళం ,
ఎక్కడో వినిపిస్తున్న
ఒక మధుర కంఠం
మృదు మధుర
భావ గీతం,
ఓ ప్రకృతి నేస్తమా
నీ ప్రేమ సరోవరం లో
మమ్మల్ని ముంచెత్తి
మనసులకి స్వాంతన
ఇస్తున్నావు,
నీకేమి ఇవ్వగలం
బదులుగా,
తల్లి ఒడి లో బిడ్డ లా
నీ కంటి పాపలుగా
నిన్ను కాపాడుకుంటూ
నీ నీడలో జీవిస్తాం.
పాల ధారలా
కురుస్తున్న జాబిలి
వెలుగులు,
మందంగా చల్లగా
మెల్లగా వీస్తున్న
శిశిర గాలి,
విచ్చుకున్న పువ్వుల
పరిమళం ,
ఎక్కడో వినిపిస్తున్న
ఒక మధుర కంఠం
మృదు మధుర
భావ గీతం,
ఓ ప్రకృతి నేస్తమా
నీ ప్రేమ సరోవరం లో
మమ్మల్ని ముంచెత్తి
మనసులకి స్వాంతన
ఇస్తున్నావు,
నీకేమి ఇవ్వగలం
బదులుగా,
తల్లి ఒడి లో బిడ్డ లా
నీ కంటి పాపలుగా
నిన్ను కాపాడుకుంటూ
నీ నీడలో జీవిస్తాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి