👌"సెలవు చీటీ" యనగా
విధి నిర్వహణ మందు
సెలవునకు దరఖాస్తు!
ఆత్మ బంధువులార!
(ఆత్మ బంధు పదాలు., శంకర ప్రియ.)
👌ఉపాధ్యాయులు.. ప్రధానోపాధ్యాయులకు; విద్యార్థులు.. తమ తరగతి టీచరులకు వ్రాసే లేఖ.. "సెలవు చీటీ"!
బంధువులు, మిత్రులు.. తమ ఆత్మీయులకు వ్రాసేవి.. "లేఖలు", అనగా ఉత్తరములు! ఇందులో.. "ఉభయ కుశలోపరి" తో ప్రారంభించి; అందరి యోగ క్షేమముల సమాచారములను వ్రాస్తారు!
👌'సెలవు చీటీ"లో.. ఫలానా, ఫలానా కారణములను వివరిస్తారు! అనగా, తమ కుటుంబ పనులు, అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత వివరములు.. సెలవు చీటీలో పేర్కొంటారు! ఆ సెలవు దరఖాస్తును మంజూరు చేయ వలసిందిగా కోరుతారు!
👌ఈనాడు సాంకేతిక విజ్ఞానమువలన, ఇంటర్నెట్ సదుపాయంతో "ఆన్ లైన్"లో సమాచారం పంపుచున్నారు!
అనారోగ్యముతో, దగ్గు, ఆయాసముతో, మిక్కిలి సతమత మవుతున్న; అక్షర శిల్పియైన, ఒక అధ్యాపకుని, దిగువ "సెలవు దరఖాస్తు"ను; ఒకసారి పరిశీలించండి!
🚩ఉత్పల మాల 🚩
హేవిభు! పాఠశాలకును హెడ్డగు మాస్టరు! నీ సబార్డినేట్
నా వినుతించు విన్నపము నాలుగు ముక్కల నాలకించుమీ!
ఫీవరు కోల్డు కాపులును వేదన హెచ్చె హెడేకు దోకులన్,
ఆవిరి పట్టినన్ వదలదా యమబాధ, మదీయ నాసికన్ (1)
ఆవహమై లలాటమున నాహవ మట్టుల నూపి రాడెడుం
దా విడువంగ బోదు, స్వర నాడుల దగ్గు సవర్ణ దీర్ఘమై
లావయి, గొంతుపట్టె సరలీస్వర మొక్కటి పల్కలేనునే
చావక చచ్చి చావునయి, సౌఖ్య విదూరుడ నైతి నోయి, మా (2)
యావిడ కూడ సేవలకు యాతన జెంది విసుంగు చూపెడున్,
ప్రోవిడు కొన్న పైకమది మొత్తము ఖర్చుయె, మందు మాకులన్
ఆ విరీతవైద్య మది యన్యగుణంబిడె సైడెఫెక్టులన్,
ట్రావెలు చేయ కూడదని డాక్టరు నాల్గు దినాలు స్కూలుకున్ (3)
పోవలదంచు నాంక్షలిడె, మూర్ఖత బోక దయార్ద్రబుద్ధివై
జీవుని వేదనన్ తెలిసి శీఘ్ర మొసంగుము లీవులన్ కృపన్!
( ⚜️ఉత్పల మాలలో సెలవు చీటీ: శ్రీ మావుడూరు సూర్యనారాయణ
మూర్తి )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి