ఎవరు బంధువులు?శంకరప్రియ , శీల.,సంచారవాణి: 99127 67098
 👌ఆపద సమయమందు
     ఆదుకొన్న వారే
     అసలైన బంధువులు!
           ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., శంకరప్రియ.,)
👌"బంధువు"లనగా, రక్త సంబంధము కలవారు! వావి వరుస లున్నవారు! బంధుమిత్రు లందరు పాటించవలసిన ధర్మములు గురించి; మానవ సంబంధములు గురించి.. మహేతిహాసమగు, శ్రీమద్రామాయణమును.. శ్రద్ధాభక్తులతో చదవండి!
👌బంధువులు.. ఒకరికొకరు కష్ట కాలములందు, చేదోడు వాదోడుగా నుండాలి! ఆ విధముగా నుండని వారికంటే; మాట సహాయం చేసిన, మంచి మిత్రులే.. ఆత్మ బంధువులు మనకు!
      🚩ఆట వెలది పద్యము🚩
      బంధువెంత గొప్ప బాంధవ్య ముండిన
      పనికిరాని నాడు పరమచేటు!
       మిత్రుడొకడె కనగ, మేలైన బంధువు!
        తెలుగుబిడ్డ లార! తెలివి గనుడి!
       ( తెలుగు బిడ్డ శతకము., కవిశ్రీ సత్తిబాబు.)

కామెంట్‌లు