పున్నమి వచ్చింది
కార్తీక పున్నమి వచ్చిందీ
చల్లని వెన్నెల మన మనసులను
ఆనంద పరిచింది !! పున్నమి!!
ఈ వెన్నెల వెలుగుల్లో
మనము దోబూచులాడాలి
దోబూచులాడుతూ ఈ వెన్నెలను
కడవల్లో నింపాలి !! పున్నమి!!
అందమైన మన ప్రేమకు మనము
అభిషేకం చేయాలి
వెన్నెల అభిషేకం చేయాలి
ప్రేమాభిషేకం చేయాలి!! పున్నమి!!
నువ్వూ నేనూ నేనే నీవై
శరత్ చంద్రమై వెలగాలి
ఈ శారద రాత్రి శృంగార నావలో
మన ప్రేమ యాత్ర సాగించాలి
కార్తీక పున్నమ పడుచుదనంతో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి