బాలసాహిత్య రచయిత, తెలుగు భాషోపాధ్యాయుడు డి.కె. చదువుల బాబు కు బాలబంధు సమతారావు పురస్కారాన్ని అందజేయనున్నట్లుతెనాలిలోని ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయాధికారిణి కావూరి రమాదేవి, ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు డా.అయినాల మల్లేశ్వరరావు తెలియజేస్తూ చదువులబాబుకు ఆహ్వానం పంపారు. ఈనెల 20వ తేదీ ఆదివారం తెనాలిలో ప్రథమశ్రేణి శాఖా గ్రంధాలయంలోని కవిరాజు త్రిపురనేని సభాభవనంలో నిర్వహించే 55వ జాతీయ గ్రంధాలయాల వారోత్సవాల కార్యక్రమంలో ఈపురస్కారాన్ని చదువులబాబు అందుకుంటారు. రాష్ట్రస్థాయిలో ఈయన రచనలు వివిధ పత్రికల్లో అనేకం ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకు 21 పుస్తకాలను ప్రచురించారు.700 పైగా కథలను, 50 కి పైగా బాలగేయాలను, 100 పైగా కవితలను, 50 పైగా సాంఘిక కథలను రచించిన డి.కె. చదువుల బాబు సాహిత్యరంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీరి రచనలు ఆంగ్ల, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి.
మహారాష్ట్రలో 3, 5, 6 తరగతుల విద్యార్థులకు చదువులబాబు రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. బాలసాహిత్య సాంస్కృతిక సేవా సమితి వ్యవస్థాపక, అధ్యక్షుడిగా తెలుగుభాషా వికాసానికి, బాలసాహిత్యాభివృద్దికి కృషిచేస్తున్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి