కొంగలు (బాలగేయం);--గద్వాల సోమన్న,--ఎమ్మిగనూరు.
పొడవైన కాళ్ళు,మెడ
కల్గిన పక్షి జాతి
అందమైన  కొంగలు
అందరికి కడు ప్రీతి

ఒంటి కాలిపైనవి
దొంగ జపం చేస్తాయి
చేపలు కనపడితే
ఠక్కున మ్రింగుతాయి

అవి బారులు దీరితే
ముగ్ధమనోహరమే
గాలిలో ఎగిరితే
పిల్లలకు  సందడే

కొల్లేటి సరస్సులో
కోకొల్లలు కొంగలు
ఎంత దూరమైనా
పయనిస్తాయి కొంగలు


కామెంట్‌లు